విజయారెడ్డి ఎఫెక్ట్.. పెట్రోల్ సీసాతో ఆత్మహత్యకు యత్నం
రంగారెడ్డి జిల్లా నవంబర్ 13
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ విజయారెడ్డి హత్య ప్రకంపనలు ఇంకా తగ్గడం లేదు. రెవెన్యూ శాఖలో అవినీతి.. భూ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై బాధితులు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు.తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తమకు అన్యాయం చేశారంటూ ఆళ్లగడ్డ తహసీల్లార్ ఆఫీసుకు దంపతులిద్దరూ పెట్రోల్ సీసా తీసుకొచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది.ఆళ్లగడ్డ మండలంలోని బత్తులూరు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దంపతులు పెట్రోల్ పురుగుల మందు తీసుకొని తహసీల్దార్ ఆఫీసులో ఆత్మహత్యకు ప్రయత్నించారు. పదేళ్లుగా తమకు న్యాయం చేయకుండా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని ఈ అఘాయిత్యానికి పూనుకున్నారు. స్థానికులు వారిని అడ్డుకొని ఈ ఆత్మహత్యయత్నాన్ని విరమించారు.సుబ్బారెడ్డికి జాతీయ రహదారి పక్కన ఉన్న 11 సెంట్ల స్తలాన్ని మరో వ్యక్తి అక్రమంగా రెవెన్యూ రికార్డుల్లో తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. స్థలం విషయంలో రెవెన్యూ ఆఫీసుల చుట్టు తిరిగినా పని కాకపోవడంతో ఈ దంపతులు ఇద్దరూ ఇలా పెట్రోల్ పరుగుల మందు తీసుకొచ్చి తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.