YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

రెవెన్యూ ఆఫీసుల వద్ద పోలీస్ ప్రొటెక్షన్

రెవెన్యూ ఆఫీసుల వద్ద పోలీస్ ప్రొటెక్షన్

రెవెన్యూ ఆఫీసుల వద్ద పోలీస్ ప్రొటెక్షన్
హైద్రాబాద్, 
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయారెడ్డిపై సురేష్ అనే రైతు పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడంతో రెవెన్యూ ఉద్యోగులంతా భయాందోళనలో ఉన్నారు. ఆ ఘటన జరిగి నాటి నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ ఆఫీసుల దగ్గర పోలీసులతో ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని రెవెన్యూశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫైర్ సిబ్బంది సహకారంతో మంటలు ఆర్పే పరికరాలను వెంటనే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అన్ని కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ బాధ్యతలను జిల్లా కలెక్టర్లపై పెట్టంది రెవెన్యూ శాఖ. వారి వద్ద ఉన్న నిధులను ఉపయోగించి ముందుగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఆదేశించింది.భద్రత కల్పించాలని కలెక్టర్లకు ఆదేశాలివ్వడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులు, అధికారులకు కొన్ని సూచనలిచ్చింది ఆ శాఖ. ప్రజల సమస్యలపై కంప్లైంట్లు తీసుకునేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని డైరక్షన్స్ ఇచ్చింది. ఆ సమయంలో ఆఫీసులోని సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలని సూచించింది. అలాగే అధికారులందరికీ రెవెన్యూ చట్టాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించింది.

Related Posts