ఇసుక విధానం ఆర్భాటమే
గుంటూరు నవంబర్ 14
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు కలచి వేస్తున్నాయి. ఇసుక నూతన విధానం అంతా అర్భాటమేనని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువరం అయన సంగం జాగర్లమూడి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు నాగ భ్రహ్మాజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జనసేన పార్టీ తరపున మృతుని భార్యకు రూ.లక్ష ఆర్ధిక సాయం అందజేసారు. తరువాత మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే జైల్, జరిమానా అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలి. కార్మికుల సెస్ నుండి నెలకు పది వేల రూపాయలు ఇవ్వాలని మనోహర్ అన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల కోసం రేపు,ఎల్లుండి డొక్కా సీతమ్మ పేరిట అన్నదాన కార్యక్రమాలుంటాయని అన్నారు.