నాగర్ కర్నూలు లో తోపులాట
నాగర్ కర్నూలు నవంబర్ 14
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం లో ఆర్టీసీ కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 41 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన ఆర్టీసీ కార్మికులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉదయం నాలుగు గంటల నుండి బస్సు డిపో కు వచ్చిన తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకున్నారు. 6 గంటల వరకు ఒక్క బస్సు కూడా డిపో నుండి బయటికి రాకపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్టీసీ కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గత నలభై రోజులుగా మేము సమ్మెలో ఉంటే మా భార్య బిడ్డలు ఆకలితో పస్తులు ఉండాల్సి వస్తుంది. ఈ బస్సులను బయటకు వెళ్ళడానికి వీలు లేదంటూ అడ్డుపడ్డారు. దీంతో స్థానిక పోలీసులు ఆర్టీసీ కార్మికులను అక్కడి నుండి చెదరగొట్టే క్రమంలో ఆర్టీసీ కార్మికులకు పోలీసులకు స్వల్ప తోపులాట జరిగింది. పక్కనే ఉన్న ప్రైవేటు బస్సుల టైర్లలో కొంతమంది ఆర్టీసీ కార్మికులు గాలి తీసివేసారు.