మోదీ సర్కార్ కు ఊరట
రాఫెల్ రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం
న్యూఢిల్లీ నవంబర్ 14
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరంలేదని స్పష్టం చేసింది. ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రులు యష్వంత్ సిన్హా, ఆరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ రివ్యూ పిటిషన్లు వేసారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్, జస్టీస్ కేకే కౌల్చ జస్టీస్ కేఎం జోసెఫ్ ల ధర్మాసనం పిటిషన్లకు కొట్టివేసింది.
కాగా రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ వ్యాఖ్యానించడం.. తన విమర్శను సుప్రీం తీర్పునకు ఆపాదించడంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చౌకీ దార్ చోర్’ వ్యాఖ్యలను రాహుల్ తమకు ఆపాదించడం దురదృష్టకరమనీ.. ఆయన భవిష్యత్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సూచించింది. . ఏ ప్రైవేటు సంస్థకు అనుచిత సహకారం అందిందన్న దానికి సాక్షాలు లేవని సుప్రీం పేర్కోంది. అసలు రాఫెల్ డీలో ఎలాంటి అవకతవకలు లేవని పేర్కోంది. ఈ కేసులో రాహుల్ గాంధీ పెట్టుకున్న క్షమాపణను అంగీకరించింది. ఆయనపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టేసింది. కాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందికి వస్తాయంటూ బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.