YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పొలకల్ లో మనబడి నాడు-నేడు కర్నూలు

పొలకల్ లో మనబడి నాడు-నేడు కర్నూలు

పొలకల్ లో మనబడి నాడు-నేడు
కర్నూలు నవంబర్ 14  
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పొలకల్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో  మనబడి నాడు-నేడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎమ్మెల్యే డా.సుధాకర్. పాల్గొన్న డీఈఓ సాయిరాం, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, సమగ్ర శిక్ష పిఓ విద్యాసాగర్ , పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇమాం, స్థానిక ప్రజాప్రతినిధులు, హెడ్మాస్టర్ కిష్టన్న, టీచర్లు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గోన్నారు.ఈ సందర్బంగా  విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో మొదటి దశలో 1143 ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు-నేడు...9 రకాల మౌళిక సదుపాయాల కల్పన జరుగుతుందని అన్నారు. దశలవారీగా అమలు జరిగే ఈ కార్యక్రమం మూడు సంవత్సరాలపాటు కొనసాగుతుంది. కార్యక్రమం అమలుకు ముందు.. అమలుకు తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన అభివృద్ధిని ఫోటోలతో సహా పోల్చి చూపడం ఈ కార్యక్రమ రూపకల్పన వెనుక ఉన్న సంకల్పమని అన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, బూట్లు అందజేయడం జరుగుతుంది. మనబడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ప్రహరీ గోడలు, తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మతులు, ఫినిషింగ్, బ్లాక్ బోర్డులు, విద్యార్థులకు రక్షిత త్రాగునీరు, ఇంగ్లీష్ ల్యాబ్ ల ఏర్పాటు లాంటి 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని  కలెక్టర్ అన్నారు.ఎమ్మెల్యే డా.సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చివేసి, మెరుగైన మౌళిక సదుపాయాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి  వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విన్నూత్న కార్యక్రమం మనబడి నాడు-నేడు అని అన్నారు.  

Related Posts