లక్సెట్టిపేట లో గాంధీ సంకల్ప యాత్ర
మంచిర్యాల నవంబర్ 14
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో నేడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సారధ్యంలో గాంధీ సంకల్ప యాత్ర జరిగింది. స్థానిక ఇటిక్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రారంభమైంది. దీనిలొ మంచిర్యాల నియోజకవర్గం లోని నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ గాంధీజీ 150వ జయంతి సందర్భంగా బిజెపి అధిష్టానం పిలుపుమేరకు కొనసాగుతున్న గాంధీ సంకల్ప యాత్ర నేడు లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ప్రారంభమైందని ఆయన ఆశయాలను సిద్ధాంతాలను సూచ తప్పకుండా ప్రతి పౌరుడు పాటించాలని సన్మార్గంలో నడవాలని సూచించారు. రాష్ట్రంలో దోపిడీ దొంగల పాలన నడుస్తోందని దోచుకో దాచుకో అనే విధంగా తెరాస కుటుంబ పార్టీ వ్యవహరిస్తుందని 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధ సమ్మె చేస్తుంటే ఆ సమ్మెపై అవాకులు చెవాకులు వాగుతూ కెసిఆర్ మరియు ఆయన పెంపుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికులను భయాందోళనలకు గురిచేస్తున్నారని దాని కారణంగానే పదుల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు కలత చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈ ఆత్మహత్యలకు కారకులు కెసిఆర్ మరియు అతని మంత్రులు ఎమ్మెల్యేలె కారణమని వారి పైన కేసులు వేసి జైలుకు పంపించాలని అలా అయితేనే చనిపోయిన ఆర్టీసీ కార్మికుల ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు కోర్టు డైరెక్షన్లో ప్రభుత్వం వెళ్లి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు