బ్లూ ఫ్రాగ్ లో సీఐడీ సోదాలు
విశాఖపట్నం నవంబర్ 14
విశాఖలో బ్లూఫ్రాగ్ సంస్ధలో సిఐడీ సోదాలు మరోసారి కలకలం రేపాయి.గతంలో ఇదే సంస్ధపై అధికారులు తనిఖీలు చేశారు.ఇప్పుడు మళ్లీ కేంధ్ర దర్యాప్తు సంస్ధ అధికారులు తనిఖీలు చెయ్యడం చర్చకు దారి తీసింది.అయితే డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖకు చెందిన బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ ... ఇసుక సరఫరా సంబంధిత వెబ్ సైట్ ను హ్యాక్ చేసిననట్లు అనుమానాలు వ్యక్తం చేసిన సిఐడీ ... సంస్థ సర్వర్లలోని డేటాను ముమ్మరంగా తనిఖీలు చేశారు.ఈ క్రమంలో బ్లూ ఫ్రాగ్ సంస్థకు చెందిన పలువురు వ్యక్తులు సైట్ ను హ్యాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించినట్లు సీఐడీకి ఫిర్యాదు అందాయి. స్టాక్యార్డ్లో పెద్దఎత్తున ఇసుక ఉన్న కూడా ఆన్లైన్లో అప్లై చేస్తే ఇసుక లేనట్లు చూపించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థ రూపొందించినట్లు సీఐడీ విచారణలో తేలింది. కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.ఐపీ అడ్రస్ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు సిఐడీ అధికారులు.