YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

చదువుల దేవాలయాలు బడులు ఒంగోలు 

చదువుల దేవాలయాలు బడులు ఒంగోలు 

చదువుల దేవాలయాలు బడులు
ఒంగోలు 
మన బడి నాడు-నేడు కార్యక్రమంతో చరిత్రను మార్చబోయే తొలి అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను చదువుల దేవాలయాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలని ఈ సందర్భంగా గుర్తుచేశారు.ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలు, విద్యార్థులనుద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. రాబోయే పదేళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించాలని, ఇప్పటికీ స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చాయని, పదేళ్ల తర్వాత రోబోటిక్స్‌ కీలకం కానున్నాయని అన్నారు. మన పిల్లలకు ఇంగ్లీష చదువులు లేకపోతే వాళ్ల భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఆలోచించండని కోరారు. ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఒక మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

Related Posts