గద్వాలలో ఒకే కంపౌండ్ లో రెండు ఇళ్లలో వరుస దొంగతనాలు
తాళం వేసిన ఇళ్లనే టార్గెట్
గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒకే రోజు ఒకే కంపౌండ్ లో మూడు ఇళ్లలో వరుసగా దొంగతనాలు జరిగిన సంఘటన చోటుచేసుకోవడం పట్టణ వాసులు ఆందోళనకు గురయ్యారు. బాధితుడు రామాంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గద్వాల పట్టణంలోని నల్లకుంటా శ్రీనివాస కాలనీలో తిమ్మారెడ్డి, బిజ్వరం సుధాకర్ రెడ్డి, రామాంజనేయులు గౌడ్ మూడు ఇళ్లలో దొంగలు పడినట్లు, విలువైన ఆభరణాలు చోరికి గురైనట్లు పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. దొంగలు ఇళ్ల తలుపులు పగలగొట్టి, బీరువాలను తెరిచి చెత్త చదరంగం పడేశారని అన్నారు.బిజ్వారం సుధాకర్ రెడ్డి హైదరాబాద్ లో పని నిమిత్తం వెళ్లినట్లు, అదే కంపౌండ్ లో పైపోర్షన్ లో అదెకుంటున్నా రామాంజనేయులు గౌడ్ తన స్వంత ఊరికి వెళ్లారు. అదే కాలనీలో నివసించే తిమ్మారెడ్డి శుభకార్యానికి వెళ్లారని...తాను గౌరీ పూజ కోసం స్వంత ఊరికి వెళ్లడం జరిగిందని తెలిపారు.
రామాంజనేయులు గౌడ్ ఇంటికి ప్రతి రోజు ఉదయం ట్యూషన్ కు వచ్చే విద్యార్థి ఇంటి తలుపులు తెరిచిఉండటాని గమనించి రామాంజనేయులు గౌడ్ కు వాట్స్ ప్ వీడియో కాల్ ద్వారా సమాచారం తెలుపగా ఇంట్లో దొంగతనం జరిగిందని నిర్దారించుకున్న రామాంజనేయులు వెంటనే గద్వాలపట్టణానికి చేరుకుని ఇంట్లో చూడగా బీరువాలో సామాన్లు, బట్టలు చిందరబందరంగా పడటం గమనించిన ఆయన గద్వాల పట్టణపోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు.
సమాచారం మా ఇంటి యజమానికి తెలిపడం జరిగిందన్నారు.వారి ఇంట్లో ఎంత దొంగతనం జరిగింది అని విషయం వారు వచ్చిన తర్వాత తెలుస్తుందని, అదేవిధంగా పక్కన ఉన్న తిమారెడ్డి ఇంట్లో కూడా చోరి జరిగింది.
జరిగిన దొంగతనం క్లూస్ టీం వచ్చిన తరువాత వివరాలు సేకరించి పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. తన ఇంట్లో దాదాపు రూ 20వేల దాకా దొంగతనం జరిగినట్లు భావిస్తున్నానని తెలిపారు. మూడు ఇండ్లలో ఎంత దొంగతనం జరిగింది అనేది క్లూస్ టీం వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.