కూకట్‌పల్లిలో ఇండోర్ స్టేడియం ప్రారంభం
హైదరాబాద్
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూకట్‌పల్లిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పోరేటర్లు, క్రీడాకారులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది అభినందించదగ్గ విషయం. ఈ స్టేడియాన్ని స్థానిక క్రీడాకారులు వినియోగించుకోవాలని, తద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. స్థానిక క్రీడాకారుకు ఈ స్టేడియం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నగర యువత షటిల్ బ్యాడ్మింటన్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నందున ఈ స్టేడియంను నిర్మించినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇప్పటికే షటిల్లో హైదరాబాద్ నుంచి చాలా మంది షటిల్ క్రీడాకారులు భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం విశేషం. వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, శ్రీకాంత్, కష్యప్ తదదితరులున్నారు.