YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ రెడ్డి అంటే తప్పేంటీ. : పవన్

జగన్ రెడ్డి అంటే తప్పేంటీ. : పవన్

జగన్ రెడ్డి అంటే తప్పేంటీ. : పవన్
విజయవాడ, నవంబర్ 14,
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ రెడ్డి అని పిలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. జగన్ రెడ్డిని ఆయన పేరు పెట్టి పిలిస్తే తప్పేంటో చెప్పాలన్నారు. జగన్ రెడ్డి అని పిలిస్తే దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని.. పవన్ నాయుడు అని వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్ రెడ్డి అంటే పవన్ నాయుడు అంటూ.. తనకు కులం ఆపాదించేందుకు ప్రయత్నించారన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ నేతలతో సమావేశమైన పవన్.. జగన్‌, వైఎస్సార్‌సీపీ నేతల తీరుపై మండిపడ్డారు.జాతీయ మీడియా మొత్తం జగన్ రెడ్డి అనే అంటోందని.. జగన్‌ను ఎలా పిలవాలో 151మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి.. సమిష్టిగా నిర్ణయం తీసుకొని ప్రజలకు తెలియజేయాలంటూ సెటైర్లు పేల్చారు. 'జగన్ గారిని జగన్ అనాలో, జగన్ రెడ్డి అనాలో , జగన్ మోహన్ రెడ్డి అనాలో, ఉత్తి జగన్ అనాలో, ఉత్తుత్తి జగన్ అనాలో' తెలియజేయమని చెప్పండి.. అలానే పిలుస్తాం అన్నారు. బొత్స గారిని కూడా ఏమని పిలవాలో చెప్పాలన్నారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని.. తాము విడిపోయి ఎవరికి వాళ్లుగా బతుకుతున్నామన్నారు.తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని అంటే ఉద్దేశపూర్వకంగా అన్నానని మంత్రి బొత్స బాధపడిపోతున్నారని.. ముందు ఎలా మాట్లాడాలో వాళ్ల నాయకుడికి (జగన్‌కి) మంత్రి చెప్పాలన్నారు. మట్టిలో కలిసిపోతారనే మాటను ఆవేశంలో అనలేదని.. తెలుగుభాషను మీరు అగౌరవపరిస్తే మట్టిలో కలిసిపోతారని మరోసారి చెబుతున్నాను అన్నారు. తెలుగు భాషను చంపే ప్రయత్నం చేస్తుంటే... వైసీపీలోని మేధావులు ఏం చేస్తున్నారన్నారు. అందరం ఒకటే అనే భావన తెలంగాణ ప్రజలు, సమాజంలో ఉంది.. ఏపీలో మాత్రం ప్రజలు వర్గాలుగా విడిపోయారన్నారు పవన్.తాను చరిత్రను చదివిన తర్వాత పార్టీ పెట్టాలనుకుని నిర్ణయించుకున్నానని.. కులమతాలకు అతీతంగా రాజకీయం చేయడం జనసేన పార్టీ విధానం విధానం అన్నారు పవన్. భాషాసంస్కృతులను కాపాడటం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని కాపాడటం తమ సిద్ధాంతమని.. కుల నిర్మూలన తన ఆశయం అన్నారు పవన్ కళ్యాణ్.

Related Posts