YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 రాహుల్ కు సుప్రీంలో ఊరట

 రాహుల్ కు సుప్రీంలో ఊరట

 రాహుల్ కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ, నవంబర్ 14,
రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ చౌకీదార్‌ చోర్‌ హై అంటూ కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో రాహుల్‌ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌పై దాఖలైన ఈ కేసును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. రాహుల్‌ గాంధీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సూచించింది. రాహుల్‌ భవిష్యత్‌లో సంయమనం పాటించాలని కోర్టు ఆదేశించింది.ప్రధాని మోదీని చౌకీదార్ చోర్ హై అంటూ తాను చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా ఆమోదించిందంటూ రాహుల్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. కోర్టు తీర్పును తప్పుగా అన్వయించి రాహుల్ ప్రధానిపై విమర్శలు చేశారని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ.. రాహుల్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలుచేశారుఇక రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కేసులో కేంద్రానికి ఊరట లభించింది. రఫేల్‌ సమీక్ష పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. రఫేల్‌పై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

Related Posts