మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పై కపిల్ సిబాల్ నిప్పులు
న్యూఢిల్లీ
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, న్యాయవాది కపిల్ సిబాల్ మండిపడ్డారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై అమిత్ షాపై కపిల్ సిబాల్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి 48 గంటల సమయం ఇచ్చి.. శివసేన, ఎన్సీపీకి 24 గంటల సమయం ఇవ్వడంపై శివసేన, ఎన్సీపీ నాయకులు గవర్నర్ కోశ్యారీపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.రాజకీయ పార్టీలను ఎలా విచ్ఛిన్నం చేయాలో, ఎలా ఏకం చేయాలో అమిత్ షాకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. ఈ విషయాల్లో ఆయనకు బాగా అనుభవం ఉందన్నారు. ఆ పర్యావసనాలను గోవాలో కానీ, కర్ణాటకలో కానీ చూడొచ్చు అని కపిల్ సిబాల్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.