YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

రిపబ్లిక్ కు బ్రెజిల్ అధ్యక్షుడు గెస్ట్

రిపబ్లిక్ కు బ్రెజిల్ అధ్యక్షుడు గెస్ట్

రిపబ్లిక్ కు బ్రెజిల్ అధ్యక్షుడు గెస్ట్
న్యూఢిల్లీ, నవంబర్ 14,
ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకలకు విదేశీ నేతలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం అనవాయితీ వస్తోంది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బోల్సోనారో ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. బ్రెజిల్ వేదికగా సాగుతోన్న 11వ బ్రిక్స్ సదస్సుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ఆహ్వానించారు. మోదీ ఆహ్వానం మేరకు గణతంత్ర వేడుకలకు రావడానికి బ్రెజిల్‌ అధ్యక్షుడు సముఖత వ్యక్తంచేసినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ.. బోల్సోనారోను ఆహ్వానించారని తెలిపింది. భారతీయులు వీసా లేకుండా బ్రెజిల్‌కు ప్రయాణించే సౌకర్యం కల్పించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.బ్రిక్స్ సదస్సులో మోదీ మాట్లాడుతూ... డిజిటల్‌ ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఉగ్రవాద నిర్మూలనకు సహకారం, ప్రపంచంలోని ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.వీరిద్దరి మధ్య జరిగిన భేటీపై విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్‌ ట్వీట్‌ చేశారు. మోదీ, బోల్సోనార్ మధ్య చర్చలు ఫలవంతమైనట్లు తెలిపారు.‘భారత్‌-బ్రెజిల్‌ భాగస్వామ్యం మరింత బలపడుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బోల్సోనారోతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి’ అని ట్విట్టర్‌లో వెల్లడించారు. వ్యూహాత్మక భాగస్వామంతో ముందుకెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వ్యవసాయ పరికరాలు, పశు సంరక్షణ, పంట కోతలో సాంకేతికత, బయో ఇంధనం తదితర రంగాల్లో బ్రెజిల్ నుంచి పెట్టుబడులను ఆశిస్తున్నట్టు మోదీ తెలిపారు.అలాగే, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌‌తోనూ మరోసారి ప్రధాని మోదీ భేటీ అయ్యారు. జిన్‌పింగ్‌‌తో భేటీపై ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‘బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ 11వ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ-జిన్‌పింగ్‌లు సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య చర్చలు ఫలవంతమయ్యాయి. వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు వారిమధ్య చర్చకు వచ్చాయి’ అని పీఎంవో ట్వీట్‌ చేసింది

Related Posts