గ్రంథాలయము అంటే దేవాలయం తో సమానం
- ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.
హుజూర్ నగర్
హుజూర్ నగర్ 52వ గ్రంధాలయ వారోత్సవాల వేడుకల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హుజూర్ నగర్ గ్రంథాలయానికి అత్యాధునిక గ్రంధాలయం గా మార్చడానికి 2 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. వాటి ద్వారా గ్రంధాలయాన్ని డిజిటల్ గ్రంథాలయం గా మార్చడం జరుగుతుందని, అత్యాధునిక హంగులతో అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా చేస్తామన్నారు. పుస్తకాలను చదవటం ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలి. రోజు పుస్తకాలు చదవడం వల్ల ఎంతోమంది గొప్ప వారి గురించి తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. ప్రతి పేపర్ను చదవాలి సమాజంలో మంచి ఎదో చెడు ఎదో తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అంటే పేపర్లో టీవీలో వార్తలు ఎక్కువగా చూడాలి. ఎంతో మంది కష్టపడి తయారు చేస్తే ఒక పుస్తకం తయారవుతుందని అలాంటి పుస్తకాల అని చదవడం ఒక హాబీ గా పెట్టుకోవాలి అని అన్నారు. దాతలు కూడా ముందుకు వచ్చి గ్రంథాలయాలకు సహాయ సహకారాలు అందిస్తే ప్రతిచోటా గ్రంధాలయాలు అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మాజీ మునిసిపాలిటీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ కుంట సైదులు, గ్రంథాలయ అధికారి వీరస్వామి, ఎంపీపీ గూడెపు శీను , జక్కుల నాగేశ్వరరావు, శీలం శీను, మన్సూర్ అలీ, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు