YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపండి

నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపండి

నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపండి
వనపర్తి 
వాహనాలను నడిపే ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని వనపర్తి జిల్లా గోపాల్పేట ఎస్ ఐ రామన్ గౌడ్ వాహనాల వారికి సూచించారు. వాహనాల తనిఖీలో భాగంగా గురువారం గోపాల్ పేట లోని పద్మావతి ఫంక్షన్ హాల్ ఎదుట వాహనాల తనిఖీనీ తన సిబ్బందితో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వచ్చి పోయే వాహనాలను ఆయన తనిఖీ చేసి వాహనాలకు సంబంధించిన కాగితాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లను ధరించి వాహనాలకు సంబంధించిన పత్రాలను కలిగి ఉండి నియమ నిబంధనల ప్రకారం వాహనాలను నడపాలని ఆయన వారికి సూచించారు. అలాగే కార్ల యజమానులు కూడా సీట్ బెల్ట్ లను దర్శించి వాహనాలు నడిపి సంబంధించిన పత్రాలతో వాహనాలను నడపాలని, సీటు బెల్టును ధరించి సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఎలా ప్రాణాలను కాపాడుకున్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలని ఆయన కార్ల యజమానులకు సూచించారు.ఈ సందర్భంగా ఆయన 200 వాహనాలను తనిఖీ చేశారు.

Related Posts