భారత అమెరికా నౌకదళ విన్యాసాలు
విశాఖపట్నం నవంబర్ 14
భారత్ అమెరికా దేశాల నేవీకి సంబంధించిన జాయింట్ విన్యాసాలు నెల 14 నుండి 21వ తేదీ వరకు తూర్పు నౌకాదళంలో జరుగనున్నాయి. ప్రకృతి విపత్తుల పునరావాస కార్యక్రమాల సందర్భంగా మానవాళికి సహాయం కోసం ఈ విన్యాసాలను టైగర్ ట్రంప్ పేరుతో జరగనున్నాయి. ఇండియన్ నేవల్ షిప్ జలశ్వ, ఐరావత్, సంధ్యక్ పాల్గొంటాయి. మద్రాస్ నుంచి ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ 19, కోస్ట్ గార్డ్ నుంచి 7 కోస్ట్ గార్డు బృందాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎయిర్ ఫోర్స్ మిగ్-17 హెలికాప్టర్, రాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ ఈ విన్యాసాల్లో పాల్గోంటున్నట్లు నేవీ అధికారులు ప్రకటించారు. ఈ విన్యాసాలు కాకినాడ వరకూ కొనసాగుతున్నట్లు చెప్పారు. జాయింట్ విన్యాసాల సందర్బంగా ఇరు దేశాల మధ్య జాయింట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.