YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

నెహ్రు చాచా పుట్టిన రోజు వేడుకలు

నెహ్రు చాచా పుట్టిన రోజు వేడుకలు

నెహ్రు చాచా పుట్టిన రోజు వేడుకలు
భారత తొలి ప్రధాని 130 వ బాలల దినోత్సవం ఘనంగా వేడుకలు
కౌతాళం నవంబర్ 14  
మండలం లో ప్రభుత్వ పాఠశాలల్లో బాలల దినోత్సవం సందర్భంగా   నెహ్రూ చాచా  పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కౌతాళం, ఏరిగేరి,బడినేహాల్, బాపురం, తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నెహ్రూ చిత్రా పటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాద్యాయులు మాట్లాడుతూ  జవహర్ లాల్ నెహ్రు భారత తొలి ప్రధాని మంత్రిని ఆయన అడుగు జడల్లో నడవాలని కోరారు.నెహ్రు దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత రత్న అవార్డు ప్రభుత్వం అందించింది అన్నారు.నెహ్రు చాచా కు పిల్లలన్నా, గులాబి లన్న,చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారని సూచించారు. అందుకే ఈ రోజు బాలల దినోత్సవం పండుగ జరుకుంటారని తెలిపారు.   పిల్లలకు ఆట పాటలు,పరుగు పందేలు, నృత్యాలు, దేశ భక్తి గీతాలు,ఆడించి అలరించారు.అనంతరం హైస్కూలు లో  చైర్మన్ వడ్డే రాముడు విద్యార్థి ని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రతిభ స్కూలులో జె కె ఎల్ ఎస్ ప్రయివేటు స్కూల్ లో నెహ్రు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు బాల బాలికలు పాల్గొన్నారు.

Related Posts