YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నేడు కోల్‌కతాకు కేసీఆర్ 

Highlights

  • కేసీఆర్ పర్యటన షెడ్యూల్
నేడు కోల్‌కతాకు కేసీఆర్ 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం కోల్‌కతా బయలుదేరుతున్నారు. ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరై మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోలుకత్తా బయలుదేరుతారు.మధ్యాహ్నం రెండు గంటలకు కోల్‌కతాలోని సుభాష్‌చంద్రబోస్ విమానాశ్రయంలో దిగి హోటల్ తాజ్ బెంగాల్‌లో విడిది చేస్తారు.మధ్యాహ్నం 3.15 గంటలకు పశ్చిమబెంగాల్ సచివాలయంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో భేటీ అవుతారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం భేటీ రెండుగంటలకుపైగా సాగే అవకాశముందని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా తదితర అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించే అవకాశముందని సమాచారం. కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్. కాళీమాత మందిరాన్ని దర్శించుకోనున్నారు.రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ వెంట రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారని తెలిసింది.

Related Posts