YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

త్వరలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తాం: మంత్రి కొడాలి

త్వరలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తాం: మంత్రి కొడాలి

త్వరలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తాం: మంత్రి కొడాలి
శ్రీకాకుళం
త్వరలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తామని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియంపై కొంతమంది సన్నాసులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజాం మండలం పొగిరిలో మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. విపక్ష నేతలు.. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించి.. పేదల విషయంలో మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఎర్రన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఢిల్లీ వెళ్లారని చెప్పారు. అచ్చెన్నాయుడుకు ఇంగ్లీష్ రాకపోవటంతో విజయవాడలో తిరుగుతున్నారన్నారు. అచ్చెన్నాయుడుని చూస్తే మాత్రం అందరికీ భయమన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంగ్లీష్‌కే ప్రాధాన్యం ఉందని తెలిపారు. ‘చంద్రబాబు పార్థనర్ పవన్ మా ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు’ అని అన్నారు. చంద్రబాబు గండిపేటలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ స్కూల్ ఏ మీడియం?, పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు?, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదా? అని అడిగారు. నేటి తరం పిల్లలకు సీఎం జగన్ మేనమామ అన్నారు. రాష్ట్రంలో 45 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.33 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మాతృభాషను నిర్లక్ష్యం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి వివరించారు.

Related Posts