YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సమస్య లేకుండానే కృత్రిమ ఇసుక సమస్య సృష్టించారు

సమస్య లేకుండానే కృత్రిమ ఇసుక సమస్య సృష్టించారు

సమస్య లేకుండానే కృత్రిమ ఇసుక సమస్య సృష్టించారు
ఇసుక కొరతపై దీక్ష సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు 
విజయవాడ 
సమస్య లేకుండానే కృత్రిమ ఇసుక సమస్య సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడ ధర్నాచౌక్‌లో ఆయన దీక్ష చేపట్టారు.రాత్రి 8గంటల వరకు దీక్ష కొనసాగనుంది. చంద్రబాబునాయుడు 12 గంటల పాటు దీక్షలో కూర్చోనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇసుకను కూడా కబ్జా చేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాను తయారు చేసి దేశం మీదకు వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఇసుక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో దొరుకుతుంటే ఇంటి దొంగలు ముఖ్యమంత్రికి కనపడరా? అని నిలదీశారు. సెల్ఫీ వీడియోలు తీసుకుని ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఈ సమస్య సృష్టించారని వ్యాఖ్యానించారు. దాదాపు 35లక్షల మంది పూట తిండికి కూడా నోచుకోని దుస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. 125 వృత్తుల వారు రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా భవనాలు నిర్మించే పరిస్థితి లేదని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే... కాలం చెల్లి చనిపోయారని మంత్రులు అనగలరా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల ఎవ్వరూ నష్టపోలేదన్నారు. సొంత పొలంలో మట్టి ఇంటికి తీసుకుపోవాలన్నా.. ప్రభుత్వ అనుమతి కావాలనటం అహంభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు ఇసుక బకాసురులో చెపాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు.
భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు దీక్ష నిర్వహిస్తున్నారు. చంద్రబాబు దీక్షకు జనసేన, లెఫ్ట్‌, ఆప్‌ సంఘీభావం తెలిపాయి. చంద్రబాబుకు దీక్షా ప్రాంగణం వద్ద వేద పండితులు స్వాగతం పలికారు. ముందుగా ఆయన బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలతో పాటు ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు నివాళులర్పించారు.

Related Posts