YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు తీరు మార్చుకోవాలి

చంద్రబాబు తీరు మార్చుకోవాలి

చంద్రబాబు తీరు మార్చుకోవాలి
రాజమండ్రి నవంబర్ 14  
తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజమండ్రి ఎంపి భరత్ ప్రతిపక్ష టిడిపికి సవాల్ విసిరారు.  ప్రతిపక్షనేత చంద్రబాబు యూటర్ప్ తీసుకొని ఇసుక ఉద్యమం అంటూ కొత్త రాజకీయ రంగు పులిమి,  ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తమ నేతల పేర్లతో చార్జ్ షీట్ విడుదల చెయ్యడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇసుకపై తగిన చర్యలు తీసుకుంటూ అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చెయ్యడం సరికాదని అన్నారు. ఇసుకను దొచుకోవడమే ప్రధాన ధ్యేయంగా గత ప్రభుత్వ హాయంలో ప్రజా ప్రతినిధులు వ్యవహరించిన ధోరణే గత ఎన్నికల్లో టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారని అన్నారు. యువకులు రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేని చంద్రబాబు తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

Related Posts