ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు చేయడం సిగ్గుచేటు: తులసిరెడ్డి
కడప
ప్రభుత్వం కావాలనే ఇసుక కొరత సృష్టిస్తోందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. వైసీపీ ఇసుకాసురుల కోసమే కొరత సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు కావాల్సిన ఇసుక లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రీచ్‌లను వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.