YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

రోడ్డు సౌకర్యం లేమి గిరిజన గర్భిణికి ప్రాణసంకటం

రోడ్డు సౌకర్యం లేమి గిరిజన గర్భిణికి ప్రాణసంకటం

రోడ్డు సౌకర్యం లేమి
గిరిజన గర్భిణికి ప్రాణసంకటం
అసిఫాబాద్ నవంబర్ 15,
అసిఫాబాద్ కొమురంభీం  జిల్లా జైనూరు మండలంలోని చింతకర్ర గ్రామానికి వెళ్లాలంటే  రోడ్డు సదుపాయం లేదు. కెరమెరి ఘాట్ సెక్షన్ నుంచి  5 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి వాగు దాటి  వెళ్లాల్సిందే....చింతకర్ర గ్రామానికి  చెందిన మడావి పద్మబాయి నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబీకులు  108 వాహనానికి సమాచారం అందించారు. కానీ ఆ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక అతికష్టం మీద వెళ్లినా అంబులెన్స్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయింది. దాంతో అప్పటికే పద్మబాయి కి పురిటినొప్పులు అధికం కావడంతో ఇంటి నుండి కొంత దూరం ఎడ్ల బండి ద్వారా తీసుక వచ్చి  ఆటోలో తరలిస్తుండగా మార్గమధ్యలో  ఆటోలోనే  మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ తీవ్ర రక్తస్రావం జరిగి ఆయాసం రావడంతో  కుటుంబ సభ్యులు గత్యంతరం లేక ఆటోలో వాగు అవతల ఉన్న 108 వాహనం వద్దకు తీసుకెళ్లి అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెరమెరి పీహెచ్సీకి తరలించారు. ప్రస్తుతం ఆ తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టినా ఆ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు జరగకపోవడం తో అధికారులు, ప్రజాప్రతినిధులు పనితీరుపై గ్రామస్థులు మండిపడుతున్నారు  చింతకర్ర సమీపం లోని వాగు పై బ్రిడ్జి నిర్మించి  కనీసం ఆ రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేయాలని చింత కర్ర గ్రామ పంచాయితీ పరిధిలోని 4 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

Related Posts