YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వాటర్ ప్లాంట్ నిబంధనలకు నీళ్లు

వాటర్ ప్లాంట్ నిబంధనలకు నీళ్లు

వాటర్ ప్లాంట్ నిబంధనలకు నీళ్లు
అనంతపురం,
కదిరి పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రం అవుతోంది. దీన్ని ఆసరాగా తీసుకున్న శుద్ధ జలకేంద్రాల యజమానులు వీధివీధినా వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. నిబంధనలను ఏమాత్రం పాటించకుండా వారికి ఇష్టం వచ్చినట్లు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా వీటిని నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. దీనిపై నిఘా ఉంచాల్సిన అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితం అవుతున్నారు. పట్టణంలోని 52, పరిసర ప్రాంతాల్లో 20 ప్లాంట్లు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ప్రతి వీధికి రెండు చొప్పున కేంద్రాలు వెలిశాయి. వీటిలో ఏ ఒక్క కేంద్రానికి ఐఎస్‌ఐ గుర్తింపులేదు. శుద్ధ జలం పేరుతో రోజుకు రూ.లక్షల్లో నీటి వ్యాపారం కొనసాగిస్తున్నారు. నిబంధనల మేరకు రసాయనిక పదార్థాలు వినియోగించి నీటిని శుద్ధి చేయాల్సి ఉంది. ఇది ఖర్చుతో కూడుకున్న పనికావడంతో నిర్వాహకులు అలా చేయడం లేదు. సాధారణంగానే ఫిల్టర్‌ చేసి నీటిని అమ్మేస్తున్నారు. 20 లీటర్ల క్యాన్‌ రూ.20తో, బిందె రూ.5 ప్రకారం అమ్ముతున్నారు. ఐఎస్‌ఐ గుర్తింపు లేకుండా ఏర్పాటు చేసిన మిషన్లలో నీళ్లు పూర్తి స్థాయిలో శుద్ధి కావు. ఏడాది గడిచిన నీటి ట్యాంకులను తప్పని సరిగా మార్చాలి. దీనిని ఏ ఒక్కరూ అమలు చేయలేదు. ఐదేళ్లు గడిచిన వారు కూడా పాత మిషన్లతోనే నీటిని శుద్ధి చేస్తున్నారు. అధికారులకు ఇది తెలిసినా ప్లాంట్లపై కనీసం తనిఖీలు కూడా చేయడం లేదు. తాగునీటి కోరత తీవ్రంగా ఉండడంతో గత్యంతరం లేక ప్రజలు డబ్బులు పెట్టి మరీ ఆ కల్తీ నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. శుద్ధి కాని నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ప్లాంట్లపై సంబంధిత అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Related Posts