YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

సిరిసిల్లలో 90 శాతం మూసుకుపోయిన మగ్గాలు

సిరిసిల్లలో 90 శాతం మూసుకుపోయిన మగ్గాలు

సిరిసిల్లలో 90 శాతం మూసుకుపోయిన మగ్గాలు
కరీంనగర్, 
 సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. ఒకప్పుడు కాటన్‌ వస్త్ర ఉత్పత్తికి అడ్డా...! 20 వేల మరమగ్గాలపై కాటన్‌ గుడ్డ ఉత్పత్తి అయిన రోజుల్లో 120వరకు డైయింగ్‌ యూనిట్లు ఆధారపడి పనిచేసేవి. ఇప్పుడంతా పాలిస్టర్‌ ఉత్పత్తివైపు మొగ్గుచూపటంతో 1500 మరమగ్గాలపైనే కాటన్‌ వస్త్రం నేస్తున్నారు. ఫలితంగా 15 డైయింగ్‌ యూనిట్లే పని చేస్తున్నాయి. ఈ పరిణామంలో అద్దకం పనిమాత్రమే తెలిసిన కొందరు కార్మికులు కుటుంబాన్ని పోషించలేక బలవన్మరణం చెందారు. మరికొందరు పస్తులుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు కాటన్‌ వస్త్రమే అత్యధికంగా ఉత్పత్తి అయ్యేది. దీని అనుబంధంగా అద్దకం పరిశ్రమ కూడా కళకళలాడుతూ ఉండేది. చీరెలు నేసి రంగలు అద్ది ఆరబెడితే 'ఇంద్ర ధనుస్సు'భూమిపై పరిచిన చందంగా పరిశ్రమ పరిసరాలు కనిపించేవి. ఇప్పుడా వన్నె తగ్గిపోయింది. కారణం.. వస్త్ర పరిశ్రమలో యజమానులు పాలిస్టర్‌ ఉత్పత్తివైపు మొగ్గుచూ పుతూ వచ్చారు. క్రమంలో 20వేల మరమగ్గాలపై కాటన్‌ ఉత్పత్తి చేసిన పరిశ్రమ.. ఇప్పుడు కేవలం 1500 మగ్గాలపైనే వస్త్రం నేస్తోంది. ప్రస్తుతం 40వేలకుపైగా మరమ గ్గాలపై పాలిస్టర్‌ ఉత్పత్తి అవుతున్నది. కాటన్‌ వస్త్రం ఉత్పత్తిని ఆధారం చేసుకుని అనుబంధంగా ఉన్న 120 అద్దకం(డైయింగ్‌) యూనిట్లు కాస్తా 15కు చేరాయి. మరోవైపు అద్దకానికి ఉపయోగించే రంగుల్లో కలిపే రసాయనాల ధరలూ పెరిగాయి. మీటర్‌ పాలిస్టర్‌ వస్త్రం ఉత్పత్తికి రూ.3 ఖర్చయితే అదే కాటన్‌ గుడ్డకు రూ.10వరకు వ్యయం అవుతోంది. కాటన్‌ ఉత్పత్తిపై మార్కెట్‌ ప్రభావమూ పడింది. ఈ నేపథ్యంలో 35 అద్దకం యూనిట్లు మాత్రమే ఉండగా.. అందులో కేవలం నాలుగు మాత్రమే 30రోజులపాటు పని చేస్తున్నాయి. మరో 15 యూనిట్లు 10 రోజులపాటు, మరో 15యూనిట్లు మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే తెరుచుకుంటున్నాయి. ఒకప్పుడు ఈ పరిశ్రమలో 2వేల మంది వరకు కార్మికులు పని చేశారు. ఉత్పత్తి అయిన గుడ్డను పెట్టికోట్స్‌ తయారు చేసేవారు. వాటిని కుడుతూ సుమారుగా మరో 2వేల మంది మహిళా కార్మికులు ఉపాధి పొందేవారు. ఇప్పుడు పెట్టికోట్స్‌ తయారీయే కనుమరుగైంది. అద్దకం పరిశ్రమలో ప్రస్తుతం 300 మంది మాత్రమే ఉన్నారు. క్రమేణా డైయింగ్‌ యూనిట్లు మూతపడటంతో కొందరు కార్మికులు ఉపాధి కోల్పోయారు. మరికొందరు కుటుంబాన్ని పోషించుకోలేక ఈ నాలుగేండ్లలో 12 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా అద్దకం పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహకాలూ లేకపోవడం గమనార్హం.

Related Posts