YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

స్టేజీ క్యారియర్లుగా టూరిస్ట్ బస్సులు కరీంనగర్, 

స్టేజీ క్యారియర్లుగా టూరిస్ట్ బస్సులు కరీంనగర్, 

స్టేజీ క్యారియర్లుగా టూరిస్ట్ బస్సులు
కరీంనగర్, 
ఆర్‌టిసి సమ్మె కొందరికి కాసుల వర్షం కురిపిస్తున్నది. అవకాశం వచ్చిందే తడవుగా ప్రయాణీకులను అందినకాడికి దోచుకోవడం పరిపాటిగా మారింది. సమ్మెను ఆసరా చేసుకుని తెలంగాణ పర్యాటక శాఖ బల్క్‌ టికెట్ల జారీ పేరిట భారీ మోసానికి తెరతీసింది. గత 35 రోజులుగా టూరిజం శాఖ తన బస్సులను నిబంధనలకు విరుద్దంగా హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, వరంగల్‌ రూట్లలో తిప్పుతున్నది. ప్రయాణికులకు వ్యక్తిగత టికెట్లను జారీ చేయకుండా స్టాటింగ్‌ పాయింట్‌ వద్ద ఇంత మంది ఎక్కారని రికార్డులలో రాసుకోడానికి నామమాత్రంగా ఒకే టికెట్‌ను కట్‌ చేస్తున్నారు. పర్యాటక శాఖ బస్సులకు టూర్‌ ప్యాకేజి పర్మిట్లు మాత్రమే ఉండగా బస్టాండ్లల్లో ప్రయాణీకులను ఎక్కించుకొని నెల రోజులుగా స్టేజీ క్యారియర్లుగా నడుపుతున్నారు. ప్రతి రోజూ 20 బస్సులు దాదాపు 6వేల కిలోమీటర్లు తిరుగుతుండగా, ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చింది అనేదానిపై సంబంధిత అధికారులు పెదవి విప్పడం లేదు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసే జరగుతుందనే విమర్శలున్నాయి.తెలంగాణ టూరిజంశాఖ వద్ధ 17, 26, 36, 40, 45, సీటింగ్‌ కెపాసిటీ గల 45 ఏసీ, నాన్‌ ఏసీ బస్సులతో పాటు 5 ఇన్నోవా వాహనాలు ఉన్నాయి. ఆర్‌టిసి బస్సులతో సమానంగా స్వరాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకూ పర్యాటక బస్సుల్ని నడుపుతున్నది. అక్టోబర్‌ 5న ఆర్‌టిసి సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి కరీంనగర్‌, వరంగల్‌ రూట్లలో ప్రతిరోజూ దాదాపు 20 టూరిస్టు బస్సులను తిప్పుతున్నది. హైదరాబాద్‌ నుంచి కరీనగర్‌కు టోల్‌టాక్స్‌తో కలుపుకుని ఎక్స్‌ప్రెస్‌ చార్జీ రూ.148 కాగా హైటెక్‌ నాన్‌ఏసీ లగ్జరీ చార్జీ రూ. 195 ఆర్టీసీ బస్సుల్లో వసూలు చేస్తారు. కాని టూరిజంశాఖ తిప్పుతున్న బస్సుల్లో మాత్రం హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, వరంగల్‌కు రూ.300 నుంచి రూ. 400 వసూలు చేస్తున్నారు. వరంగల్‌ వెల్లే బస్సులను ఇమ్లీబన్‌, ఉప్పల్‌ నుంచి, కరీంనగర్‌ వెళ్లే బస్సులను జూబ్లీ బస్టాండ్‌ నుంచి నడుపుతున్నారు. టూరిజంశాఖ నడుపుతున్న బస్సులు, ఇన్నోవాలకు పర్యాటక ప్రాంతాల రూట్‌ పర్మిట్లు మాతమ్రే ఉన్నాయి. అయినా సమ్మె ప్రారంభమైనప్పటినుంచి నెలరోజులుగా బస్టాండ్‌ ఆవరణలోకి వెళ్లి నేరుగా స్టేజీ క్యారియర్లుగా నడుపుతున్నారు.బస్సులో ఎక్కుతున్న ప్రయాణీలకు వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వడం లేదు. కరీంనగర్‌ లేదా వరంగల్‌కు అప్‌లో ఇంతమంది, డౌన్లో ఇంతమంది ప్రయాణీకులు ఎక్కారని గంపగుత్తన ఒకే టికెట్‌ కట్‌ చేస్తూ రికార్డులు రాసుకుంటున్నారు. సీటింగ్‌ కెపాసిటీ ప్రకారం కాకుండా అదనంగా ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా ఇంకా సీట్లు నిండలేదని బల్క్‌ టికెట్‌ కట్‌ చేస్తున్నారు. అలాగే మార్గ మధ్యంలో ఎక్కే ప్రయాణీకుల లెక్కా పత్రం లేదు. గత నెల రోజులుగా ఎన్ని బస్సులు తిప్పుతున్నారనే దానికి పర్యాటక శాఖ అదికారులు సమాధానం చెప్పడం లేదు. కాగా గత నెల రోజులుగా స్టేజీ క్యారియర్లుగా టూరిజంశాఖ బస్సులను నడుపుతున్నా... అంతర్గత విజిలెన్స్‌ అధికారులు నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహరిస్తున్నారు. పర్యాటక శాఖ ప్రాంతాలను చూసేందుకు వెల్లే ప్రయాణీకులు ఆన్‌లైన్‌ లేదా వ్యక్తిగత టికెట్‌ తీసుకుని ప్రయాణించే సందర్భంలో వారంలో పలుమార్లు బస్సులపై దాడులు నిర్వహించే విజిలెన్స్‌ అధికారులు నెల రోజులుగా స్టేజీ క్యారియర్లుగా ఇష్టా రీతిలో నడుపుతున్నా పట్టించుకోక పోవడంలో అంతర్యమేమిటో అధికారులకే తెలియాలి.

Related Posts