YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నష్టాల్లో మొక్క జొన్న రైతులు

నష్టాల్లో మొక్క జొన్న రైతులు

నష్టాల్లో మొక్క జొన్న రైతులు
వరంగల్, 
ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంట చేతికి అందింది అనుకుంటే అతివృష్టితో నోటి దాకా వచ్చిన పంట నీటిపాలైపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వర్షాలు కురిసిన సమృద్ధిగా కాలమైంది. పంటలు ఏపుగా పెరిగి దిగుబడి కూడా భారీగానే వచ్చింది. పల్లి, మొక్కజొన్న పంటలు అనుకున్న సమయానికి దిగుబడి వచ్చినప్పటికి వర్షాలు భారీగా కురుస్తుండడంతో ఆ పంట మొత్తం నీటిపాలైపోయింది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు సాగు చేసిన పల్లి, మొక్కజొన్న పంటలు దిగుబడి చేతికొచ్చిన దాన్ని మార్కెట్‌కు తరలించే లోపే వర్షార్పణం అయిపోయింది. గత నెల పల్లి పంట ఉత్పత్తి భారీగానే వచ్చినప్పటికి చెలుకల్లోనే వర్షాలకు పల్లి పంట మొత్తం మొలకెత్తింది.ఆరకంగా పల్లి రైతులను తీవ్ర నష్టానికి గురి చేసిన వర్షాలు అక్టోబర్ మొదటి వారంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నీటిపాలైపోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ అటవీ ప్రాంతమైన ములుగు భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో అధికంగా మొక్కజొన్న పంట సాగైంది. పంట అధిక ఉత్పత్తితో వచ్చిందనుకున్న రైతులకు అతివృష్టి ఆ ఉత్పత్తిని ముంచేసింది. కంకితో ఉన్న ఉత్పత్తిని మొక్క మిషన్ల ద్వారా ఒలిచి మార్కెట్లు, రోడ్లపై ఆరపోసుకున్నారు. వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న ఉత్పత్తి మొత్తం నీటిపాలైపోయింది.ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు అనుకున్న దానికన్నా ఎక్కువగానే కురుస్తున్నందున అధికార యంత్రాంగం రైతులను కాపాడడంలో విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. వర్షాకాలంలో వచ్చిన పంట ఉత్పత్తులకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రైతులు పండించిన పంటను మార్కెట్‌కు తరలించినపుడు తేమ శాతంతో దాన్ని రిజెక్ట్ చేస్తారు. అందుకు రైతులు వచ్చిన పంట ఉత్పత్తిని ఆరబెట్టుకొని అమ్ముకోవాలిస ఉంటుంది. దానికి సంబంధించిన మెకానిజం అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.రైతుకు వచ్చిన దిగుబడి సరిపోనూ టార్ఫాలిన్ లాంటివి వ్యవసాయాధికారులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వర్షాలు వచ్చినప్పటికి వాటి ద్వారా పంట ఉత్పత్తిని రక్షించుకునే అవకాశం ఉంటుంది. పంట ఎంత సాగు చేశారు.. దిగుబడి ఎంత వచ్చింది.. వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని ముందస్తుగానే వ్యవసాయశాఖ తగిన ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. అవేవి పట్టనట్లుగా వ్యవహరించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు రూ.కోట్లాది పంటను నష్టపోవాల్సి వచ్చింది.

Related Posts