YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కర్నాటకలో ఉప ఎన్నికల వేడి

కర్నాటకలో ఉప ఎన్నికల వేడి

కర్నాటకలో ఉప ఎన్నికల వేడి
బెంగళూరు నవంబర్ 15 : 
దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన కర్ణాటక పోలటిక్స్ లో మరోసారి ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఫ్యూహాత్మంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి పెద్ద సవాల్ గా మారనున్నాయి.అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు తీర్పు ఊరటనిస్తే ... వారిని బీజేపీకి ఆహ్వానించడం ఇప్పుడు కన్నడ గడ్డపై హాట్ టాపిక్ గా నిలుస్తోంది.అయితే ఖాళీ అయిన స్ధానాల్లో 15కి మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది కేంధ్ర ఎన్నికల సంఘం.ఈ ఎన్నికలు ఎవరి వైపు నిలుస్తాయన్నది ఇప్పుడు చర్చనియాంశంగా మారింది.
కర్ణాకటకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర మాజీ స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌కుమార్‌ విధించి అనర్హత వేటును ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.అయితే వారికి స్పీకర్‌ విధించిన అనర్హత కాలాన్ని కొట్టివేసింది.గత అసెంబ్లీ సమావేశాల్లో ధిక్కార స్వరాన్ని వినిపించారనే కారణంతో స్పీకర్ రమేష్ 17 మందిపై అర్హత వేటు వేశారు.ప్రస్తుత అసెంబ్లీ  కాలం 2023 సంవత్సరం ముగిసేవరకు అనర్హత ఎమ్మెల్యేలు పోటీ చేయరాదని స్పీకర్‌ నిబంధన విధించగా.. ఈ నిబంధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో అనర్హతకు గురైన 17మంది ఎమ్మెల్యేలు రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది.గత జూలై నెలలో అప్పటి కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. కాంగ్రెస్‌ జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూళిపోయింది.దీంతో మొత్తం 17మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్‌ అనర్హత వేటు వేశారు.దీనిపై ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటీషన్ వేశారు.దీనిపై ఇంతకాలం విచారణ కొనసాగించిన అత్యున్నత న్యాయస్ధానం .. పోటీ చేసేందుకు అవకాశం ఇస్తూ తీర్పు నిచ్చింది.దీంతో 17 మంది బీజేపీలో చేరి ఉప ఎన్నికలకు సిద్దమవుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందిస్తోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సారథ్యంలో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కర్ణాటకకు చెందిన 17 మంది తిరుగుబాటు శాసన సభ్యులు ఉప ఎన్నికల్లో పోటీ చేయొచ్చంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ డిమాండ్ ను లేవనెత్తింది. కాంగ్రెస్ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చడానికి బీజేపీ ఆపరేషన్ కమలంను చేపట్టిందనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పష్టమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణ్ దీప్ సుర్జేవాలా, అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్మేలు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని బలహీన పరిచారని విమర్శించారు. 
అప్పట్లో కాంగ్రెస్ జేడీఎస్ స్థానంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అనంతరం ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్ధానాల్లో ఉపఎన్నికలు అనివార్యమైంది.దీంతో వారి రాజీనామాల వల్ల ఖాళీ అయిన 17 స్థానాల్లో 15 చోట్ల వచ్చే నెల 5వ తేదీన ఉప ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కొందరు అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ను కలిశారు. బీజేపీ చేరేందుకు వారు ఆసక్తి చూపించారని, ఈ విషయమై సీనియర్‌ నేతలను కలిసినట్లు అశ్వత్‌నారాయణ్‌ తెలిపారు. ఇందుకు అధిష్ఠానం కూడా అంగీకరించడంతో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో అనర్హత ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతారని చెప్పారు. అయితే ఉప ఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తోంది.మరి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాపై మరి కోద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related Posts