వనపర్తి లో బిజెపి గాంధీ సంకల్ప యాత్ర
వనపర్తి
మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల పాదయాత్ర ను నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ ఇంచార్జ్ బంగారు శృతి నేడు వనపర్తి లోప్రారంభించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని వీధుల గుండా ఈ యాత్ర నిర్వహించారు.
గాంధీజీ ఆశయాలను, విలువలను సమాజానికి అందించాలని భారత ప్రధాని మోడీ చేస్తున్న కృషిని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. స్వచ్ఛత కోసం దేశ వ్యాప్తంగా ఏడు కోట్ల మరుగుదొడ్లను నిర్మించిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కిందన్నారు.2024 నాటికి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. సింగల్ యూజుడు ప్లాస్టిక్ నిషేధాన్ని, స్వచ్ఛత ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. కార్యక్రమంలో బిజెపి వనపర్తి జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర నాయకులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.