డీఎస్పీని కలిసిన నారా లోకేష్
నెల్లూరు నవంబర్ 15
నెల్లూరు రూరల్ డిఎస్పి రాఘవ రెడ్డి ని నారా లోకేష్,నెల్లూరు జిల్లా టిడిపి
నాయకులు శుక్రవారం కలిసారు. వైకాపా నాయకులు,పోలీసుల వేధింపుల కారణంగానే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తీక్ తల్లి ఫిర్యాదు చేసినా సంబంధిత వ్యక్తుల పై కేసు నమోదు చెయ్యలేదని ఫిర్యాదు చేసారు. ఎన్నికల్లో టిడిపి కి మద్దతు పలికినందుకే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కార్తీక్ ని వేధించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి,ఎస్సై,వైకాపా నాయకుల పై పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చెయ్యాలని కోరారు. ఆరోపణలు వచ్చిన వైకాపా నాయకులు, ఎస్సై పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తామని నెల్లూరు రూరల్ డిఎస్పి రాఘవ రెడ్డి హామీ ఇచ్చారు.