YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

రామ మందిర నిర్మాణం కోసం షియా వక్ఫ్ బోర్డు భారీ విరాళం

రామ మందిర నిర్మాణం కోసం షియా వక్ఫ్ బోర్డు భారీ విరాళం

రామ మందిర నిర్మాణం కోసం షియా వక్ఫ్ బోర్డు భారీ విరాళం
లక్నో 
 అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ రూ.51 వేల విరాళం ప్రకటించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బోర్డు అనుకూలంగా స్పందించిందనీ.. దశాబ్దాల నాటి ఈ వివాదంపై సుప్రీంకోర్టు అత్యుత్తమ తీర్పు వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలో ఐదు ఎకరాలు కేటాయించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది.ఈ నేపథ్యంలో రిజ్వీ స్పందిస్తూ... ‘‘అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాముడు అందరితో పాటు ముస్లింలకు కూడా దేవుడే. అందుకే ‘వసీం రిజ్వవీ ఫిల్మ్’ తరపున రామ మందిరం కోసం రామ జన్మభూమి న్యాస్‌కు రూ. 51 వేలు విరాళంగా ఇస్తున్నాం..’’ అని రిజ్వీ పేర్కొన్నారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారత్‌లోని ‘రామభక్తులకు’ గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు.

Related Posts