రాఫెల్ తీర్పు కాంగ్రెస్ కు గుణపాఠం
విజయవాడ నవంబర్ 15 :
2018 డిసెంబరు14న సుప్రీం కోర్టు రాఫేల్ కుంభకోణం పై విచారణ అవసరం లేదని తీర్పు ఇచ్చింది. అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ బిజెపి పై దుష్ప్రచారం చేసింది. అవినీతి కి మారుపేరైన కాంగ్రెస్ కు ఈ తీర్పు ఒక గుణపాఠమని బీజేపీ నేత రావేల కిషోర్ బాబు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. భారత దేశం అంటే అవినీతి, కుంభకోణాల దేశమనే అపప్రదను కాంగ్రెస్ తన పాలన లో తీసుకువచ్చారు. ప్రజా సంపదను దోచుకుని స్విజ్ బ్యాంకులలో దాచుకున్నారు. .ఈ తీర్పు వల్ల... మోడీ నీతివంతమైన పాలనకు నిదర్శనం. మోడీ అవినీతి రహిత పాలన చూసి.. ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయని అయన అన్నారు. నాడు వాజ్ పేయ్, నేడు మోడీ లు సమర్ధవంతంగా పాలన అందించారు. అపరిపక్వత కలిగిన నాయకుడు రాహుల్ గాంధీ.. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చౌకీదార్ చోర్ అని వ్యాఖ్యానించడం సరికాదని కోర్టు మొట్టికాయలు వేసింది.అయితే తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పినా... అతని మాటలతో ప్రజల్లో మరింత చులకన అయ్యారు. గాంధీ మహాత్ముడు కన్మ కలలను నిజం చేసేందుకు మోడి కృషి చేస్తున్నారు. ఈనెల 16వ తేదీ సాయంత్రం టిడిపి కి చెందిన వైద్యులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు బిజెపి లో చేరతారని అయన వెల్లడించారు. కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానిస్తారని అయన అన్నారు.