సీపీని కలిసిన వంశీ
విజయవాడ నవంబర్ 15
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ శుక్రవారం విజయవాడ పోలీస్ కమిషనర్ ని కలిసి ఫిర్యాదు చేసారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమ్మాయిలతో మార్పింగ్ ఫోటోలను జతచేసి తప్పుడు ప్రచారం చేస్తున్న అసలు దోషులను శిక్షించాలని పోలీస్ కమిషనర్ ను కోరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్ సైట్ల నుండి ఈ దుష్ప్రచారం జరుగుతోందని ప్రాథమిక సమాచారాన్ని పోలీస్ కమిషనర్ కు అందజేసారు. తనపై ఆరోపణలు విమర్శలు చేస్తున్న టిడిపి నేతల బతుకు ఏంటో అందరికీ తెలుసు. దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మాత్రాన నా ఇమేజ్ ఏమీ తగ్గదు. ఎన్నికల సమయాల్లో సూట్కేసులు కొట్టేసేవారు తనపై ఆరోపణలు చేస్తే వారి బండారం అంతా బయట పెడతానని అయన అన్నారు.