YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నెల రోజులపాటు వైయస్సార్ నవశకం

నెల రోజులపాటు వైయస్సార్ నవశకం

నెల రోజులపాటు వైయస్సార్ నవశకం
అమరావతి, నవంబర్ 15,:
వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కై నవంబర్ 20 నుండి డిసెంబర్ 20 వరకు నెలరోజులపాటు వైయస్ ఆర్ నవశకం పేరిట గ్రామ వార్డు వాలంటర్ల ల ద్వారా ఇంటింట సర్వే క్యాంపెయిన్ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం కార్యదర్శి నీలం సాహ్ని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి శుక్రవారం ఉదయం ప్రభుత్వ  ప్రదాన కార్యదర్శి నీలం సాహ్ని సీఎస్ హోదాలో మొదటి సారిగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పెరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కు సీ ఎస్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. అందరం సమిష్టిగా కృషి చేసే ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రతి నిరుపేద గడపకు నవరత్నాల పథకాల లబ్ధిని, వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల  లభ్ధిని పారదర్శకంగా, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. వాలంటీర్ల ద్వారా అందించాలని  సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వివిధ సంక్షేమ పధకాలకు అర్హులైన లభ్ధిదారులను సాచ్యురేషన్ పద్దతిలో గుర్తించి ఎంపిక చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డును తీసేయకుండా అదనంగా నూతన బియ్యం కార్డు వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక కార్డు వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ కార్డు, జగన్నన విద్యా దీవెన, జగన్నన వసతి దీవెన కార్డుల పంపిణీకి లభ్ధిదారుల గుర్తింపునకు సత్యరమే చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా 7 ఇతర సంక్షేమ పథకాలైన వై.ఎస్.ఆర్.మత్యకార భరోసా వై.ఎస్.ఆర్.నేతన్న నేస్తం వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పధకం, అమ్మ వడి స్వంత షాపులు ఉన్న టైలర్లు రజకులు నాయా బ్రాహ్మణులకు ఆర్ధిక సాయం, వై.ఎస్.ఆర్. కాపునేస్తం,ఇమామ్స్, మౌజంలు పాస్టర్లు అర్చకులకు గౌరవ వేతనం పెంపు కు సంబంధించిన లభ్ధిదారులను గుర్తించేందుకు క్యాంపెయిన్లో పగడ్బందీగా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డ్ సచివాలయాలల్లో లబ్ధిదారుల జాబితాను డిస్పే చేసి, అభ్యంతరాలను స్వీకరించి, సోషల్ అడిల్ నిర్వహణ ద్వారా పారదర్శకంగా గడుపు లోపు లబ్ధిదారులను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను  సీఎస్ ఆదేశించారు. 5 లక్షల వరకు వార్షిక  ఆదాయం ఉన్న వారికి కూడా వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి అన్ని రకాల బియ్యం కార్డు కల్గిన వారు అర్హులన్నారు. 12 ఎకరాల కన్న తక్కువ తడి భూమి. 35 ఎకరాల  కన్నా తక్కువ పొడి భూమి ఉన్న భూ యజమానులు అర్హులు. తడి,పొడి భూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు 5.00 లక్షలోపు వార్షిక ఆదాయం ఉన్నఅవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పార్ట్ టైమ్ ఉద్యోగులు, పారిశుద్ద్య కార్మికులుకు ఆరోగ్యశ్రీ పథకం వరిస్తుందని సూచించారు. వీడియో కాన్పెరెన్స్ లో ఆయా శాఖాలకు సంబంధించిన  పధకాల లబ్ధిదారుల గుర్తింపునకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయా  శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులు వివరించారు. వీడియో కాన్పెరెన్స్ లో స్పెషల్ సీఎస్ నీరబ్ కమార్ ప్రసాద్, ఎడ్యుకేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, సీఎంవో కార్యదర్శి సోలమన్ ఆరోఖ్య రాజ్, సివిల్ సప్లయిస్ సెక్రటరీ  కోన శశిదర్ మున్సిపల్ శాఖ కమీషనర్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.వినయ్ కుమార్, సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Related Posts