YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ప్రయివేటుకు రోడ్లకు వ్యతిరేకంగా  సిపియం దర్నా

ప్రయివేటుకు రోడ్లకు వ్యతిరేకంగా  సిపియం దర్నా

ప్రయివేటుకు రోడ్లకు వ్యతిరేకంగా  సిపియం దర్నా
హైదరాబాద్ నవంబర్ 15,
హైదరాబాద్ నగరంలో రోడ్ల ప్రయివేటికరణ చేయ్యోద్దని బల్దియా ప్రదాన కార్యాలయం ముందు సిపియం నగర కమీటి అద్వర్యంలోదర్నా చేశారు. రోడ్ల నిర్వహణ ప్రయివేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన తరువాత జిహెచ్ఎంసికి...., అందులో పనిచేస్తున్న ఇంజనీరింగ్  అధికారులు ఎం చేయ్యాలని సిపియం నగర కార్యదర్శి శ్రీనివాస్ ప్రశ్నించారు.  రోడ్ల అభివృద్దికి వేలాది కోట్లరూపాయలు ఖర్చు అవుతున్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికి..., అధి వాస్తవం కాదని... బల్దియాకు నిదులు ఇవ్వకుండా రోడ్లు ఎలా భాగు పడుతాయన్నారు.  సిటిలో 9వేల కిలో మీటర్లు ఉంటే ఎడాదికి  400కోట్లు మాత్రమే ఖర్చుచేస్తున్నారని.. ఎదాదికి 1000కోట్లు వెచ్చిస్తే నగరంలో మంచి రోడ్లు ఉంటాయన్నారు. గతంలో ఏర్పాటు చేసిన రోడ్ కార్పొరేషన్ కాదని ఇప్పుడు ప్రయివేటు వారికి ఇస్తున్నారని అరోపించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా నగరంలో రోడ్లను ప్రయివేటు పరం చేయ్యడం సరికాదని దినిని వెంటనే  విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

Related Posts