YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయింది. 

అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయింది. 

అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయింది. 
జోగుళాంబ గద్వాల
కొత్త ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి నోచుకోలేదు. అందులో బిటి రోడ్లు గోనుపాడు, మధ్యాలబండ పనులు ఎక్కడికక్కడ ఆగడం దీనికి నిదర్శనమని బీజేపీ నేత డీకే ఆరుణ  అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పుష్కరాలు సమయంలో చేసిన పనులు తప్ప నేటికి అసంపూర్తిగా ఉన్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయిందన్నారు. మున్సిపల్ ఛైర్మెన్ ఉన్నపుడు చేసిన పనులు తప్ప,11 నెలలు మున్సిపల్ ప్రభుత్వం పరిగాణలో ఉండగా ఎంతవరకు అభివృద్ధి చేశారో తెలియజేయాలన్నారు. జనరల్ ఫండ్ క్రింద గత మా ప్రభుత్వంలో మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కుంటుపడకుండా చూశామన్నారు. ????1000 రూపాయలకు చొప్పున ఆవులను కొనుగోలు చేసి కలెక్టర్ నిధుల నుండి 4 లక్షలతో కొనుగోలు చేసి రైతుల నుండి 15 వేల రూపాయలు వసూలు చేయడం,5 వేల రూపాయలు భీమా కోసం చెల్లించడం,  రైతులు విజయ్ డైరీ పాలు అందించే వారికే ఇస్తున్నామని చెప్పడం వెనుక జిల్లా అధికారులు ఆంతర్యం ఏమిటనని ప్రశ్నించారు. పారదర్శకత పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు బయట ఆవులను అమ్ముకొంటుంటే ఎందుకు బయటపెట్టలాన్నారు. టీఆరెస్ పార్టీ నాయకులు ఆవులను కొనుగోలు చేశామని చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు స్పష్టత ఉండాలన్నారు. ము న్సిపల్ ఎన్నికలు ఉన్నాయని వెలువడితే వెంటనే 2000 వేల రూపాయలు ఇచ్చారని లేదనగానే బంద్ చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయని తెలియగానే మళ్లీ నిధులు, పెన్షన్ జ్ఞాపకం వస్తాయని తెరాస ప్రభుత్వాన్ని ఎద్దేవాచేశారు. 2 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఒక నాయకుడు ప్లాంట్ నందు నిల్వచేస్తే అధికారులు చోధ్యం చూస్తన్నారని అధికారులు నాయకుల అడుగులకు మడుగులు ఒత్తే పనులలో అధికారులు  నిమగ్నమయ్యారన్నారు. జిల్లా పాలనధికారి అక్రమ భూములపై పరిశీలన చేయకుండా సమాచారం ఇస్తే అధికారికంగా ఫిర్యాదు చేయాలన్నారు. సర్వే నెంబర్ 49, 33 ఫీట్ల రోడ్డును అక్రమంగా అక్రమించుకున్న తెరాస నాయకులను అధికారులు ఏమిచేస్తున్నరని అడిగారు. టిఆరెస్ నాయకుని స్థలంలో ఇసుక డాంపులు నిల్వలను అధికారులు ఎందుకు పరిశీలన చేయడం లేదో తెల్పాలన్నారు. గొర్రెలు పోయినావి, ఆవులు పోయినావి, చేపలు చెర్వులను సైతం ఈ ప్రాంత తెరాస నాయకులు దోచుకొంటున్నారు. ముఖ్యమంత్రి వస్తే గోనుపడు రోడ్డు వేసారు.  జూరాల నుండి నేటివరకు ప్లడ్ కొనసాగుతున్న అధికారులు ఎప్పటికప్పుడు నీటిని నిల్వలు పరిశీలన చేసి సాగు, త్రాగునీరు పూర్తిస్థాయిలో నిల్వలు చేయాలని ఆరుణ అన్నారు.

Related Posts