మిషన్ భగీరథ పైపులైన్ లీక్
మహబూబాబాద్
గంగమ్మ నింగికెగిసింది. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అవడంతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఘటన మహబూబబాద్ జిల్లా గూడూరు పట్టణంలో చోటుచేసుకుంది. వరంగల్ - భధ్రాచలం జాతీయ రహదారి రహదారి వెంబడి గూడూరు పెట్రోల్ బంక్ వద్ద భగీరథ పైప్లైన్కు లీకేజీ ఏర్పడటంతో నీరు పైకి ఎగజిమ్మింది. ఆకాశానికి ఎగిసిపడుతున్న నీటిని చూసి కొంతమంది వాహనదారులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. రెండు గంటల పాటు నీటి ప్రవాహం అలాగే కొనసాగింది. మిషన్ భగీరథ పైపులైన్కు సంబంధించిన ఎయిర్వాల్వ్ పైకప్పు ఊడిపోవడంతో విలువైన శుద్ధ జలాలు ఎగిసిపడ్డాయి. దాదాపు 30 మీటర్ల ఎత్తున లీకేజీ నీరు ఎగజిమ్మడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఊడిపోయిన పైకప్పును సకాలంలో సరిచేయకపోవడంతో దాదాపు రెండు గంటల పాటు తాగునీరు వృథాగా పోయింది.