YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ప్రేమికుడి ఆత్మ హత్యాయత్నం,

ప్రేమికుడి ఆత్మ హత్యాయత్నం,

ప్రేమికుడి ఆత్మ హత్యాయత్నం,
హైదరాబాద్ 
హైదరాబాద్ నగర శివారు పహాడీ షరీఫ్ పి.ఎస్. పరిధిలో ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసాడు. ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.  వివరాలలోకి వెళితే ఫలక్ నూమ పోలీస్ స్టేషన్ పరిధిలోని  ముస్తఫా నగర్ లో నివసించే అబ్దుల్లా (23) వృత్తిరిత్యా డ్రైవర్. అతని  స్నేహితుడు సోహైల్ కూడా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  స్థానికంగా నవాబ్ సాబ్ కుంటాకు చెందిన సమీరా తో ప్రేమలో పడ్డ అబ్దుల్లా, సమీరను వెంట బెట్టుకొని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ ప్రాంతం లోని హార్డ్ వేర్ పార్క్ ప్రాంతంలో కొంతసేపు గడిపారు. ఇంతలో ఇద్దరూ  గొడవ పడ్డారు. సమీరా దగ్గర  ఉన్న డబ్బులు లాక్కొని ఆమెను పంపి వేసాడు. అబ్దుల్లా ఫ్రెండ్ సోహైల్ గోషా మెహల్ నుండి ఆటో లో లోడ్ తీసుకొని తుక్కుగుడా ప్రాంతానికి వెళ్లే మార్గమద్యం లో వీరి ఇద్దరిని చూసి వెళ్ళటం జరిగింది.  తిరిగి వచ్చే తప్పుడు అమ్మాయి మాత్రమే నడుచుకుంటు వెళుతుంటే అబ్దుల్లా ఏడీ  వాకబు చేస్తుండగా బైక్ పై అక్కడికి  అబ్దుల్లా చేరుకొని బైక్ సీటు  కింద సీసాలో దాచుకున్న పెట్రోల్ పోసుకొని దుకాణం నుండి కొన్న అగ్గి పుల్లతో నిప్పు అంటిచుకున్నాడు. ఇదంతా  ఒకే సారి జరగటం తో అక్కడి నుండి అమ్మాయి వెళ్లి పోయింది.  సోహైల్ స్థానిక పహాడి షరీఫ్  పోలీసులకు సమాచారం అందించటం తో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అబ్దుల్లా ను ఊస్మానియ ఆసుపత్రికి  చికిత్స  నిమిత్తం తరలించారు. ఘటనలో స్నేహితుడు సోహైల్ కు కూడా  35 శాతం కాలినట్లు డాక్టర్లు వెల్లడించారు.

Related Posts