జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు
అనంతపురం
టీడీపీ నేత జీసీ దివాకర్ రెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. అయనకు 3 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు వున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అయన పంచాయతీ రాజ్ శాఖ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. గతంలో చాలాకాలం జేసీ దివాకర్ రెడ్డి పీఏగా పనిచేసారు.
జేసీ దివాకర్ రెడ్డి పదవిలో ఉన్నా, లేకపోయినా సురేష్ రెడ్డి అయనకు సేవలు అందించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏఈఈ సురేష్ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. దాంతొ శుక్రవారం ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో తనిఖీలు జరిపారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ల పై దాడులు జరిగాయి.