YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎన్నికల్లో గెలుపుపై ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు 

ఎన్నికల్లో గెలుపుపై ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు 

ఎన్నికల్లో గెలుపుపై ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు 
హైదరాబాద్ 
ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఉన్న నేతలు నోట్ల కట్టలు నమ్ముకొని, అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యేలకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్లు అన్ని విచారించిన హైకోర్టు… ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వారిలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో ఆరుగురు ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి స్వయాన మామకు చెందిన ఫాంహౌజ్లో భారీగా నగదుతో పాటు మద్యం కూడా దొరికింది. దాదాపు 25కోట్ల రూపాయలతో పాటు ఏ నేతకు ఎంతిచ్చారో రాసి ఉన్న డైరీ కూడా దొరికిందని ఎన్నికల సమయంలో వార్తలు వచ్చాయి. మరికొన్ని చోట్ల కూడా పట్నం నరేందర్రెడ్డికి సంబంధించిన నగదు దొరికిందన్న ఆరోపణలు వచ్చాయి.
ఇక జనగాం నియోజకరవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డితో పాటు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేష్రెడ్డి, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులకు కోర్టు ఆదేశాలిచ్చింది. వీరంతా నగదు విచ్చలవిడిగా పంచారని ఆరోపణలు రావటంతో పాటు ప్రత్యర్థులు అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు. నగదుతో పాటు ఎన్నికల అఫిడవిట్లలో ఈ నేతలు తమ ఆస్తులను, కేసులను చూపించలేదని ప్రత్యర్ది పార్టీల నుండి పోటీ చేసిన నేతలు ఫిర్యాదులు చేశారు

Related Posts