YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శివసేనకు సీఎం పదవి సీఎంపీకి మూడు పార్టీలు ఓకే

శివసేనకు సీఎం పదవి సీఎంపీకి మూడు పార్టీలు ఓకే

శివసేనకు సీఎం పదవి
సీఎంపీకి మూడు పార్టీలు ఓకే
ముంబై, నవంబర్ 15,
మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడినట్టేనా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ), కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు పార్టీలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళికను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీల నాయకులు కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44 స్థానాల్లో గెలుపొందాయి.శివసేనకే సీఎం పదవిఐదేళ్ల పాటు శివసేనకే సీఎం పదవి ఇవ్వాలని కనీస ఉమ్మడి ప్రణాళికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారు. స్పీకర్‌ పోస్టును కాంగ్రెస్‌ను, కౌన్సిల్‌ చైర్మన్‌ పదవికి ఎన్సీపీకి కట్టబెట్టనున్నారు. మంత్రి పదవుల్లో శివసేనకు 14, ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 మంత్రి స్థానాలు దక్కనున్నాయి. ఈ క్రమంలో మూడు పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.మహారాష్ట్రకు ఈ ఐదేళ్లు కాదు.. రాబోయే 25 ఏళ్లు కూడా శివసేన సైనికుడే సీఎంగా ఉంటారని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాబోతున్నామని ఇవాళ ఉదయం ఆయన మీడియాతో పేర్కొన్నారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. గతంలో శివసేనతో కలిసిన పార్టీలో ఐదేళ్ల పాటు సుస్థిర పాలనను అందించాయని రౌత్‌ గుర్తు చేశారు.

Related Posts