వెస్టిండీస్ సిరీస్ నుంచి ధోని మళ్లీ ఎంట్రీ
ముంబై,
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరంగా ఉంటున్న ధోనీ.. డిసెంబరులో వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్ కోసం మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విండీస్‌తో సిరీస్ కోసం సెలక్షన్‌కి అందుబాటులో ఈ మాజీ కెప్టెన్ ఇప్పటికే భారత సెలక్టర్లకి కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.భారత్ గడ్డపై వెస్టిండీస్‌తో డిసెంబరు 6 నుంచి టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే షెడ్యూల్ రూపొందించగా.. మ్యాచ్ వేదికలు కూడా ఖరారైపోయాయి. మరోవైపు ధోనీ కూడా ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. ఝార్ఖండ్‌లోని రాంచీ క్రికెట్ స్టేడియంలో రోజూ ధోనీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మేరకు ధోనీ ప్రాక్టీస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వరల్డ్‌కప్ తర్వాత ధోనీని పూర్తిగా పక్కనపెట్టేసిన సెలక్టర్లు.. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కోసం పంత్‌తో పాటు సంజు శాంసన్‌ని కూడా జట్టులోకి చేర్చారు. అయితే.. అతనికి తుది జట్టులో మాత్రం అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో.. ధోనీకి మళ్లీ అవకాశమిస్తారా..? అంటే సెలక్టర్లకి మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. బ్యాటింగ్‌లో విఫలమవుతున్న పంత్.. కీపింగ్‌లోనూ బేసిక్ తప్పులు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో.. భారత సెలక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.