YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో నారా ప్రకంపనలు

టీడీపీలో నారా ప్రకంపనలు

టీడీపీలో నారా ప్రకంపనలు
గుంటూరు, 
నారా లోకేష్.. నారా వారి రాజకీయ వారసుడు. అయితే ఆయన మంత్రి పదవి చేపట్టిన వేళావిశేషమేమో కాని ఏదీ కలసి రావడం లేదు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందనగా మంత్రి పదవి చేపట్టిన నారా లోకేష్ చంద్రబాబు తర్వాత పార్టీని సమర్థవంతంగా నడిపిస్తారని అందరూ భావించారు. అంతకు ముందు నేరుగా రాజకీయాల్లోకి రాకున్నప్పటికీ నారా లోకేష్ పార్టీకి బ్యాక్ టీంగా పనిచేశారు. నగదు బదిలీ పథకం ఆలోచన నారా లోకేష్ దేనని అప్పట్లో చంద్రబాబు చెప్పుకుని మురిసిపోయారు.అయితే మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన తీరు బయటపడింది. నేతలతో సఖ్యతగా లేకపోవడం, అప్పటి మంత్రులకు సరైన గౌరవం ఇవ్వకపోవడం వంటివి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే చర్చనీయాంశమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష‌్ణమూర్తి చూస్తున్న రెవెన్యూ శాఖపై పెత్తనమంతా నారాలోకేష్ దేనంటూ అప్పట్లో విమర్శలు కూడా విన్పించాయి. అనేకసార్లు కేఈ కృష్ణమూర్తి కూడా నారా లోకేష్ పై నేరుగా విమర్శలు చేయకపోయినా తన అసంతృప్తిని పార్టీపై పలుమార్లు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే.రెండున్నరేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన నారా లోకేష్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడం పార్టీ నేతల్లో మరింత చులకన చేసింది. టీడీపీ అధికారంలోకి కూడా రాకపోవడంతో నేతలందరికీ నారా లోకేష్ టార్గెట్ అయ్యారని తెలుస్తోంది. నారా లోకేష్ పార్టీలో తనకంటూ ఒక గ్రూపును మెయిన్ టెయిన్ చేస్తున్నారని, చంద్రబాబు మాట కూడా చెల్లుబాటు కావడం లేదన్నది పార్టీలో బహిరంగంగానే విన్పిస్తున్న మాట. జిల్లా రాజకీయాల్లో నారా లోకేష్ వేలు పెట్టడం వల్లనే గ్రూపులు మరింత పెరిగిపోయాయన్న ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి.ఇప్పుడు పార్టీని వీడుతున్న నేతలందరూ నారా లోకేష్ ను టార్గెట్ చేస్తుండం విశేషం. చంద్రబాబు పట్ల ఒకింత గౌరవం ప్రదర్శిస్తూనే చినబాబును మాత్రం తిట్టిపోసి మరీ వెళుతున్నారు. వల్లభనేని వంశీ దగ్గర నుంచి దేవినేని అవినాష్ వరకూ నారా లోకేష్ తీరుపై కామెంట్స చేయడం గమనార్హం. పార్టీకి భవిష‌్యత్ నాయకుడిగా భావిస్తున్న నారా లోకేష్ పై వేస్తున్న నిందలతో పార్టీ క్యాడర్ లోనూ ఆందోళన కలుగుతోంది. నిజంగా నేతలు చెప్పేది నిజమే అయితే నారా లోకేష్ తన తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. ఇమేజ్, ఛరిష్మా, వాక్చాతుర్యం ఇవేమీ లేకుండా కేవలం వారసత్వంతోనే ఆధిపత్యం చెలాయించాలనుకుంటే భవిష్యత్ చాలా దుర్లభంగా ఉంటుందన్నది నారా లోకేష్ గుర్తెరగాలి.

Related Posts