YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

 ఆర్టీసీ సమ్మెతో చిన్న వ్యాపారులు విలవిల

 ఆర్టీసీ సమ్మెతో చిన్న వ్యాపారులు విలవిల

 ఆర్టీసీ సమ్మెతో చిన్న వ్యాపారులు విలవిల
హైద్రాబాద్, నవంబర్ 16,
స్సుల్లో, బస్స్టేషన్ల లోపల, బయట స్నాక్స్, వాటర్ ప్యాకెట్స్, కంకులు, పండ్లు అమ్ముకుని బతికే స్మాల్ వెండర్స్ గిరాకీ లేక దినదిన గండంగా బతుకుతున్నరు. సరిపడా బస్సులు లేకపోవడం, టెంపరరీ డ్రైవర్లతో నడిపిస్తుండడం లాంటి కారణాలతో చాలా మంది ప్యాసింజర్ ప్రైవేట్ వెహికల్స్ పై వెళ్తున్నరు. బస్సుల కోసం బస్స్టేషన్లకు వచ్చే వారి సంఖ్య చాలా తగ్గింది. దీంతో బస్సులు ఎక్కి దిగుతూ స్నాక్స్ అమ్ముకునేవారితో పాటు వ్యాపారమూ దెబ్బతింటోందని బస్స్టాండ్ ముందు పండ్లు, వస్తువులు అమ్ముకునే తోపుడు బండ్ల వ్యాపారులు చెబుతున్నారు. బస్స్టేషన్లలో టెండర్ పాడి స్టాళ్లు దక్కించుకున్న వ్యాపారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సమ్మె వల్ల బస్స్టేషన్లకు ప్యాసింజర్లు రావడం తగ్గింది. బయట ఆటోలు, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్లిపోతున్నారు. దీంతో పండ్లు, స్నాక్స్, బుక్స్టాల్స్, ఇతర షాపులకు గిరాకీ పడిపోయింది. దీంతో నెలనెలా రెంట్ మీదపడుతోందని వ్యాపారులంటున్నారు. 2 నెలలుగా అప్పుచేసి కిరాయి కడుతున్నామని, పరిస్థితి ఇట్లే ఉంటే కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఓ మెట్టు దిగి, కార్మికులతో చర్చలు జరిపి, బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని వీరంతా కోరుతున్నారు.
విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు
ర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సర్కారు విఫలం కావడం.. పల్లెలు, మారుమూల ప్రాంతాలకు బస్సులు నడవకపోతుండటంతో స్టూడెంట్లు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నరు. అంతా సాఫీగా ఉందని సర్కారు చెప్తున్నా.. రోజూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి వచ్చే స్టూడెంట్స్ కు అష్టకష్టాలు తప్పడం లేదు. సమ్మెకు ముందు రోజూ లక్షల మంది స్టూడెంట్లు సొంతూర్ల నుంచి మండల కేంద్రాలు, పట్టణాల్లోని స్కూళ్లు, కాలేజీలకు బస్సుల్లో వెళ్లేవారు. సమ్మె మొదలైనప్పటి నుంచి పల్లెలకు, మారుమూల ప్రాంతాలకు బస్సులు నడవడం లేదు. కొన్నిచోట్ల బస్సులు వస్తున్నా ఇష్టమొచ్చిన టైంలో తిప్పుతున్నారు. దాంతో స్టూడెంట్స్ ఆటోలు, జీపుల వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఆటోలు, జీపులవాళ్లు ప్రయాణికుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. వారు అడిగినంత ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి. అంతేకాదు పరిమితికి మించి జనాన్ని ఎక్కిస్తున్నారు. దాంతో ఫుట్బోర్డులపై, సైడ్ రాడ్లను పట్టుకుని ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తోంది. అంతేకాదు టైముకు అందుబాటులో లేక పొద్దున ఏడు గంటలకే ఇంట్లోంచి బయలుదేరాల్సి వస్తోంది. ఇంటికి చేరేసరికి రాత్రి ఏడు దాటుతోంది. ఈ ఇబ్బందులు పడలేక చాలా మంది స్టూడెంట్లను వారి తల్లిదండ్రులు స్కూళ్లు, కాలేజీలకు పంపడం లేదు. ముఖ్యంగా ప్రైవేటు వాహనాల్లో పంపడం ఇష్టం లేక ఆడపిల్లల తల్లిదండ్రులు చదువు మాన్పించాలన్న ఆలోచిస్తున్నారు. బస్సుల్లేక అన్ని స్కూళ్లు, కాలేజీల్లో స్టూడెంట్ల హాజరు తగ్గిందని టీచర్లు చెప్తున్నారు.
ప్రధాన రూట్లలో నడుస్తున్న చాలా బస్సుల్లో టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లు స్టూడెంట్లను ఎక్కనివ్వడం లే దు.  ఎక్కించుకుంటే కలెక్షన్ టార్గెట్ నిండదని, అట్లైతే డీఎంలు డ్యూటీలు ఇవ్వరని దింపేస్తున్నారు. సాయంత్రం టైంలో ఈ పరిస్థితి ఎక్కువుంది. దాంతో మారుమూల ప్రాంతాల స్టూడెంట్లు ఇంటికి చేరేందుకు రాత్రి అవుతోంది. గతంలో పోలిస్తే బస్సుల సంఖ్య సగానికి తగ్గడంతో ఫుట్బోర్డుపై నిలబడి, టాప్‌పై ఎక్కి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. బస్సులు తిరగని ప్రాంతాల వాళ్లు, టైంకు బస్సు అందుకోలేనివారు ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు.

Related Posts