YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

నల్గొండలో ఇసుక దందా

నల్గొండలో ఇసుక దందా

నల్గొండలో ఇసుక దందా
నల్గొండ, నవంబర్ 16,
నల్లగొండ జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా హైసెక్యూరిటి నెంబర్ ప్లేట్‌లు లేకుండా వాహనాలు తిరుగుతున్న జిల్లా రవాణా శాఖా అధికారులు వాటిపై దృష్టి సారించడం లేదు. జిల్లా వ్యాప్తంగా వందలాది వహనాల యజమానులు నెంబర్ ప్లేట్‌లు లేకుండా తమ వాహనాలలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న పట్టించుకునే దిక్కు కనిపించడం లేదు. అందేకాదు పదిహేను, పదహారు సంవత్సరాల వయ స్సు కలిగిన పిల్లలు లైసెన్సులు లేకుండానే ఇసుకను అక్ర మంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న రవాణా శాఖ అధి కారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని వాగులు, నదులు, వంకల నుంచి రోజు వందలాది ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.ప్రధానంగా మూసి, కృష్ణ నదులతో పాటు హాలియా వాగుల నుంచి ఇసుక అక్రమ తరలింపు యాథే చ్ఛగా సాగుతోంది. ఇసుకను నిబంధనలకు విరుద్దంగా ట్రాక్టర్‌ల ద్వారా తరలిస్తున్న అక్రమార్కులు తమ వాహ నాలకు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌లు లేకుండానే నడుపుతూ, తమ వాహనాన్ని అధికారులు గుర్తించకుండా భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. ఆయా ట్రాక్టర్లకు అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ అధికారులు దృష్టిని సారించుకు న్నప్పటికీ స్థానిక పోలీసులు సైతం ఈ విషయాన్ని ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ రవాణా దారుల నుంచి నెలనెలా మామూళ్లు దండు కుంటున్న నేప థ్యంలోనే సంబంధిత ట్రాక్టర్ల యాజమా న్యాలపై పోలీ సులు చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శ లు వినిపిస్తున్నాయి. కృష్ణానది నుంచి దేవరకొండ, హాలి యా, పెద్దవూర, దామరచర్ల, నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్ళ చెర్వు మండలాలకు పెద్ద ఎత్తును ఇసుక ఆక్రమ రావాణా నిరంత రాయంగా జోరుగా సాగుతోంది.మూసీ నుంచి భూదాన్ పోచంపల్లి, అర్వపల్లి, సూర్యాపేట, వేములపల్లి, మిర్యాల గూడ తదితర మండలాలకు నిబంధనలకు విరు ద్దంగా అక్రమార్కులు ఇసుక రవాణా చేస్తున్నారు. పాలేరు వాగు నుంచి మోతే, నడిగూడెం, కోదాడ మండలాలతో పాటు ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం మండలాలకు ఇసు కను అక్రమార్కులు ట్రాక్టర్లలో తరలిస్తూ జేబులు నింపు కుంటున్నారు. ఆయా వాగుల నుంచి నదుల నుంచి ఇసుక ను అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఇంజన్‌లకు, ట్రాలీలకు హైసెక్యూరిటి రిజిస్ట్రేషన్ నెంబర్లు లేకుండానే వాటి యజమానులు నడుపుతున్నారు. కనగల్ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా ఇరువైనాలుగు గంటలు సాగుతు న్నా అటు రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తు న్నారు. ఈ వాగులో నుంచి ఇసుకను తరలిస్తున్న అక్రమా ర్కులు ఎక్కువ మంది ఆ ఇసుకను జిల్లా కేంద్రమైన నల్లగొం డలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.జిల్లా కేంద్రానికి చెందిన పోలీసులు కొందరు ఇసుక ఆక్రమ రావాణా దారులతో కుమ్మకై ఈ ‘దందా’ను ప్రోత్స హిసు ్తన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెంబర్ ప్లేట్‌లేని ట్రాక్టర్లలోనే ఈ ఇసుక రవాణా కొనసాగుతుండటం విశేషం. ఇది ఇలా ఉండగా హాలియా వాగుతో పాటు మూసి, కృష్ణ నదుల నుంచి హైద్రాబాద్‌కు ఇసుక ఆక్రమ రావాణా యధేచ్ఛగా జరుగు తూనే ఉంది. లారీల్లో నిబంధనలకు మించి అధిక లోడ్ చేస్తు ఇసుకను తరలిస్తున్న రావాణా శాఖ అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తు న్నా యి. అధిక లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న లారీలు జాతీ య రహదారి గుండా వెళ్లుతున్నా పోలీ సులు, అధికా రులు కాని ఏ మాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం.

Related Posts