YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాధా ఎంట్రీ.... అవినాష్ ఎగ్జిట్

రాధా ఎంట్రీ.... అవినాష్ ఎగ్జిట్

రాధా ఎంట్రీ.... అవినాష్ ఎగ్జిట్
విజయవాడ, నవంబర్ 16
దేవినేని అవినాష్ పార్టీని వీడాలని దాదాపు ఎనిమిది నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. అయితే అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం వంగవీటి రాధాను పార్టీలోకి చంద్రబాబు తీసుకోవడమే. వంగవీటి రాధాను టీడీపీలో తీసుకోవాలని నిర్ణయించినప్పటి నుంచే దేవినేని అవినాష్ కొంత ఇబ్బంది పడుతున్నారట. తన సన్ని హితుల వద్ద కూడా ఆయన వంగవీటి రాధా విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారని తెలుస్తోంది.అయితే ఎన్నికలు సమీపిస్తుండటం తనకు గుడివాడ నియోజకవర్గం కేటాయిస్తామని చెప్పడంతో కొంత ఉగ్గబట్టి ఊరుకుకన్నారని దేవినేని అవినాష్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన తండ్రి దేవినేని నెహ్రూ కలను సాకారం చేయాలని దేవినేని అవినాష్ భావించారు. అయితే గుడివాడలో దాదాపు 60 కోట్లు వెచ్చించినా గెలవకపోవడం, వంగవీటి రాధా చేరిక విషయాన్ని మళ్లీ అనుచరులు ప్రస్తావించడంతో దేవినేని అవినాష్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట.నిజానికి దేవినేని, వంగవీటి కుటుంబాలు వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా ప్రత్యర్థులే. దశాబ్దకాలంగా ఇదే పద్ధతి నడుస్తుంది. ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు మరో పార్టీలో ఉంటారు. అయితే వంగవీటి రత్నకుమారి ఎమ్మెల్యే అయిన తర్వాత క్రమంగా మార్పు చోటు చేసుకుంది. కొంతకాలం రెండు కుటుంబాలు టీడీపీ కాంగ్రెస్ లో కొంతకాలం కొనసాగినా తర్వాత మళ్లీ మొదటికొచ్చింది. దేవినేని నెహ్రూ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మంచి అనుబంధం ఉండేది. అలాగే వంగవీటి రాధాకు కూడా అదే స్థాయిలో వైఎస్ ప్రాధాన్యత ఇచ్చేవారు.అయితే ఎన్నికలకు ముందే దేవినేని నెహ్రూ వైసీపీలో చేరాలని భావించారు. కాంగ్రెస్ నుంచి నేరుగా వైసీపీలోకి రావాలనుకున్నారు. చంద్రబాబుతో తనకు అటాచ్ మెంట్ పెద్దగా లేదని నెహ్రూ ఎప్పుడూ చెప్పేవారంటారు. అయితే వైసీపీలోకి నాడు నెహ్రూ కుటుంబం రాకుండా వంగవీటి రాధా అడ్డుకోగలిగారు. దీంతోనే విధిలేని పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని దేవినేని అవినాష్ సన్నిహితులు చెబుతున్నారు. వంగవీటి రాధా టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఎగ్జిట్ కావాలని దేవినేని అవినాష్ నిర్ణయించుకున్నా అప్పుడు చంద్రబాబు సర్దిచెప్పారంటున్నారు. మొత్తం మీద రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉండవన్నది మరోసారి స్పష్టమయింది

Related Posts