అశ్వత్థామ రెడ్డి ఇంటి దగ్గర కార్మికుల ధర్నా
పోలీసలు, కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాద్ నవంబర్ 16
మీర్ పెట్ లోని ఆర్టీసీ జేఏసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తమ నాయకుడి ఆరెస్టు వార్త తెలుసుకుని అక్కడికి చేరుకున్నఆర్టీసీ కార్మికులు రోడ్డు పై బైఠాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు పెద్ద ఎత్తున చేసారు. పోలీసులు అశ్వత్థామ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కార్మికులను బయటకు పంపించారు. అయినా కార్మికులు మళ్ళీ ఆందోళనకు దిగారు. దాంతో వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు. అశ్వత్ధామ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు నిరాహారదీక్ష అన్నారు. తన నివాసంలోనే అయన నిరాహారదీక్షకు కూర్చున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినా పోలీస్ స్టేషన్ లో దీక్షను కొనసాగిస్తానన్నారు. అర్ధరాత్రి తన ఇంటిని పోలీసులు చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారని అయన అరోపించారు.