YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

కులవృత్తులకు ప్రోత్సహం ప్రజ్ఞాపూర్

కులవృత్తులకు ప్రోత్సహం ప్రజ్ఞాపూర్

కులవృత్తులకు ప్రోత్సహం
ప్రజ్ఞాపూర్ నవంబర్ 16
కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్తున్న మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ కు  ప్రజ్ఞాపూర్ లోని హరిత హోటల్  వద్ద రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు ఘనస్వాగతం పలికారు.  తరువాత మంత్రి మీడియాతో మాట్లాడారు. భవిష్యత్ తరాలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ది ముఖ్యమంత్రి ఆశయం. ముఖ్యమంత్రి ఆలోచనలతో కార్యరూపం దాల్చిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్రం పచ్చదనం తో విలసిల్లుతుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో దేశానికే ఆదర్శంగా నిలిచింది. కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అనేదే ముఖ్యమంత్రి ఆశయమని తలసాని  అన్నారు.

Related Posts